Rana: ప్రభాస్ గొప్పదనం చెప్పిన రానా.. హంబుల్ హ్యూమన్ బీయింగ్ అంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ (Prabhas) , రానా (Rana Daggubati) మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. బాహుబలి (Baahubali), బాహుబలి2 (Baahubali 2) సినిమాలలో ప్రభాస్, రానా అద్భుతమైన అభినయంతో అదరగొట్టారనే చెప్పాలి. రానా తాజాగా ఒక సందర్భంలో ప్రభాస్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ ఎక్కువ సమయం మాట్లాడడని రానా అన్నారు. 5 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాడని ఆయన చెప్పుకొచ్చారు. స్టార్ హీరో ప్రభాస్ గొప్ప పనులు చేయడానికి ఇష్టపడతారని రానా కామెంట్లు చేశారు.

ప్రభాస్ సింపుల్ గా ఉంటారని, హంబుల్ హ్యూమన్ బీయింగ్ అని రానా పేర్కొన్నారు. రానా చెప్పిన ఈ విషయాలు ప్రభాస్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్, రానా కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ ను ఫ్యాన్స్ సైతం ఇష్టపడతారు. రజనీకాంత్ సార్ తో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకునేవాడినని ఆయన తెలిపారు.

వేట్టయాన్ సినిమాతో ఆ కల నెరవేరిందని రానా చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ వినగానే ఇంప్రెస్ అయ్యానని ఈ సినిమా రజనీకాంత్ స్టైల్ సినిమా కాదని అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కానుందని రానా అన్నారు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) హాలీవుడ్ అవేంజర్స్ రేంజ్ లో ఉంటుందని రానా పేర్కొన్నారు. కల్కి సినిమాలో నేను నటించానని అనుకుంటున్నారని అయితే ఆ ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

రాజమౌళి (S. S. Rajamouli) సక్సెస్ సీక్రెట్ గురించి రానా మాట్లాడుతూ రాజమౌళితో ఆరేళ్లు ట్రావెల్ చేశానని మార్కెట్, రెమ్యూనరేషన్ లాంటి విషయాలను జక్కన్న పట్టించుకోరని చెప్పుకొచ్చారు. అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలని రాజమౌళి భావిస్తారని ఆయన వెల్లడించారు. రానా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు రానాకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus