టాలీవుడ్ హెర్క్యులస్‌గా పేరు గాంచిన రానా దగ్గుబాటి… కొంత కాలం క్రితం అనారోగ్యం పాలయ్యారు. గతంలో ఓసారి అనారోగ్యం బారిన పడిన ఆయన కోలుకుని వరుస సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత కూడా మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్‌కి వచ్చింది అనుకుంటున్నారా? మరోసారి ఆయనే ‘ఆరోగ్యం’ అనే విషయం గురించి మాట్లాడారు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి రానా హెల్త్ అనే టాపిక్ మీద చర్చ జరుగుతోంది.
గురుగ్రామ్‌లో జరిగిన సినాప్స్ వేడుకలో రానా పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడగాలి అనుకుంటే కళ్లు, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి. లేదంటే అడిగే అవసరం లేదు అంటూ అవయవ దానం గురించి ప్రస్తావించాడు రానా. మనిషి చివరి దశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడని, ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుందని చెప్పాడు.
ఈ విషయంలో తాను కూడా మినహాయింపు కాదన్న రానా… ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినపుడు తనకున్న అనారోగ్య సమస్యలు తెలిశాయని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే తనను తాను భిన్నంగా చూడడం మొదలుపెట్టాడట. సమస్యలు ఎదురైనప్పుడే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అన్నీ ఒకేలా ఉండవని కూడా అనిపిస్తుంది. అని రానా చెప్పాడు. ‘బాహుబలి’ సినిమా కోసం పెరిగిన బరువు… అనారోగ్యం వల్ల తగ్గాడట.
అనారోగ్యం కారణంగా బరువు తగ్గగానే అందరూ ‘ఆరోగ్యంగానే ఉన్నావా?’ అంటూ అడిగారట. అయితే ఆ సమయంలో వారికి సమాధానం చెప్పాలని ఆయన అనుకోలేదట. సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘అరణ్య’ షూటింగ్‌లో పాల్గొన్నానడట. ఆ సినిమా వల్ల సంవత్సరం పాటు అడవిలో నివసించే అవకాశం వచ్చిందని, ప్రకృతికి మించిన వైద్యం లేదని అప్పుడు అర్థమైంది అని రానా (Rana Daggubati) తెలిపారు.
పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!