Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

ఏ ముహూర్తాన ‘స్పిరిట్‌’ (Spirit) సినిమా నుండి దీపికా పడుకొణె (Deepika Padukone) తప్పుకుందో కానీ.. అప్పటి నుండి సినిమా పరిశ్రమలో పని గంటల పంచాయితీ నడుస్తూనే ఉంది. ఆ సినిమాలో నటించడానికి ఆమె నో చెప్పడానికి వర్కింగ్‌ అవర్స్‌ ఓ కారణమని లీక్‌ బయటకు వచ్చింది. అప్పటి నుండి ఆమె ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇప్పుడు అదే వర్కింగ్‌ అవర్స్‌ విషయలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని రానా అభిప్రాయపడ్డాడు.

Rana Daggubati

సినిమా పరిశ్రమలో ప్రాజెక్ట్‌ను బట్టి పని గంటల మారుతూ ఉంటాయన్నారు. మద్రాసు నుండి హైదరాబాద్‌కు మారిన తెలుగు ఇండస్ట్రీ నుండి నేను వచ్చాను. వందల మంది కుటుంబాలతో ఒక నగరం నుండి మరొక నగరానికి వచ్చారు. నా వరకూ సినిమా అనేది పని కాదు.. జీవనశైలి. ఒక్కో ప్రాజెక్ట్‌కు దానికి పనిచేసే వ్యక్తులను బట్టి పని వేళలు ఉంటాయి అని అన్నాడు రానా.

అంటే సినిమా సినిమాకు పని గంటల విషయంలో తేడా ఉంటుందని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే టీమ్‌ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్‌ విధానం ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో 8 గంటల షిప్ట్‌ విధానం ఉంది. అయితే మహారాష్ట్రలో ఉదయం 9కి కానీ షూటింగ్‌ మొదలుకాదు. తెలుగులో 7 గంటలకే మొదలైపోతుంది. కొంతమంది చెబుతున్నట్లు సెట్‌లో నటుల్ని బలవంతంగా ఎక్కువసేపు ఉండాల్సి వస్తోందా అని అడిగితే..

సినిమా పరిశ్రమలో ఎవరూ ఎవరినీ బలవంతంగా ఉండమని చెప్పరని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది నటులు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేసే వాళ్లూ ఉన్నారు. అది వాళ్ల పనితీరు అని రానా చెప్పుకొచ్చాడు. అంటే ఇంచుమించు దీపిక పడుకొణె చెప్పిన మాటలకే రానా సపోర్టు చేసినట్లే. అయితే ప్రాజెక్ట్‌ కోరుకుంటే ఆ నటుడు / నటి ఎక్కువ సమయం ఉండాల్సి రావొచ్చు అని కూడా అన్నాడు.

చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus