రానా హెల్ప్ తో హిట్టు కొడతాడేమో చూడాలి..!

కెరీర్ ప్రారంభంలో హ్యాట్రిక్ హిట్లు కొట్టి అందరికీ షాకిచ్చాడు రాజ్ తరుణ్. దీంతో ప్రేక్షకుల్లో ఆయన పై మినిమం గ్యారంటీ హీరో అనే నమ్మకం ఏర్పడింది. ఆ తరువాత వచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా సో సో గా ఆడినా.. ‘ఈడో రకం ఆడో రకం’ చిత్రంతో హిట్టందుకోవడం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ యావరేజ్ గా ఆడటంతో రాజ్ తరుణ్ క్రేజ్ కు పెద్ద ప్రాబ్లెమ్ కాలేదు. కానీ ‘అందగాడు’ ‘రంగుల రాట్నం’ ‘లవర్’ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ తరువాత రానా దగ్గుపాటి నిర్మించబోయే ఓ చిత్రంలో రాజ్ తరుణ్ ను హీరోగా ఎంచుకున్నాడట. రాజ్ తరుణ్ తో గతేడాది ‘లవర్’ వంటి డిజాస్టర్ తీసిన అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నాడట. ఇటీవల రానాని కలిసి ఓ కథను వినిపించాడట దర్శకుడు అనీష్. అతి తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రం పూర్తవుతుందని అనీష్.. రానాకి చెప్పాడట. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ నుండీ వరస పెట్టి చిన్న సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి కూడా…! ఏధైతేనేం.. రానా నిర్మాతగా రాజ్ తరణ్ హీరోగా సినిమా అంటే ఓపినింగ్స్ కూడా బాగానే వస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా అయినా హిట్టయ్యి వరుస ప్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కి రిలీఫ్ ఇస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus