Rana Daggubati: రానాకి మూడు సినిమాలు ఉన్నాయి… కానీ ఎప్పుడో తెలియదు!

వరుస సినిమాలు చేసే రానా(Rana Daggubati).. ఈ మధ్య ఒక్కసారిగా జోరు తగ్గించేశాడు. ఆ తర్వాత సెలెక్ట్‌డ్‌గా కొన్ని సినిమాలు మాత్రం చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో పూర్తి స్థాయిలో తిరిగి సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తాడు కాబట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా తన రాబోయే సినిమాల గురించి చెప్పాడు. కానీ క్లారిటీ మిస్‌ అయింది. రానా రీసెంట్‌గా ‘వేట్టయన్‌’లో (Vettaiyan)  విలన్‌గా నటించాడు. ఆ తర్వాత మళ్లీ అతని నుండి సినిమా రాలేదు.

Rana Daggubati

అయితే ‘రానా దగ్గుబాటి షో’ అంటూ ఓ టాక్‌ షో చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతరులకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నాడు. అందులో భాగంగా తన రాబోయే మూడు సినిమాల గురించి చెప్పాడు రానా. ‘విరాట పర్వం’  (Virata Parvam) సినిమా తర్వాత రానా నుండి హీరోగా ఏ సినిమా కూడా రాలేదు. ‘స్పై’ మూవీలో క్యామియో చేయగా.. ‘వేట్టయన్’లో విలన్‌ అంతే.

కొత్త సినిమాల గురించి చూస్తే రానా తన డ్రీమ్ ప్రాజెక్టు ‘హిరణ్య కశ్యప’ గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాడు. గుణశేఖర్ (Gunasekhar) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారని తొలుత అన్నారు. కానీ ఆయన తప్పుకున్నారు / తప్పించారు. ఆ స్క్రిప్ట్‌ పని త్రివిక్రమ్ (Trivikram) చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆయన డైరెక్ట్‌ చేయరు. ఇక రెండో సినిమా గురించి చూస్తే.. తేజతో (Teja) చేయాల్సిన ‘రాక్షస రాజు’. రానా మంచి హిట్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) ఒకటి.

ఆ కాంబినేషన్‌ కావడంతో ‘రాక్షస రాజు’ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా ఇంకా తేలడం లేదు. కథను పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నామని, బాగా చేయాలనే లక్ష్క్ష్యంతోనే టీం పని చేస్తోందని చెప్పాడు రానా. అందుకే ఆ సినిమా కూడా ఆలస్యం అవుతోందన్నాడు. ఇక చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమా మూడోది. ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని, తమ కలయికలో సినిమా తప్పక వస్తుందని రానా చెప్పాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus