అబ్బుర పరుస్తున్న దగ్గుబాటి రానా ఇంట్లోని సౌకర్యాలు..!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత మనం వినే ఉంటాం. అలాగే ఉన్నోళ్లు కోరుకుంటే దక్కనిది ఉంటుందా అనేది కూడా అలాటిందే. వేలకోట్ల ఆస్తులు వందల కోట్ల సంపాదన ఉన్నప్పుడు, వేసే బట్టలు, వాడే కార్లు, ఉండే ఇల్లు ఏదైనా అధ్బుతంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఉన్నోళ్లకు ఇల్లు అనేది స్టేటస్ సింబల్స్ లో ఒకటి. ఈ మధ్య చిరంజీవి తన కొత్త ఇంటికి మారారు. వంద కోట్లకు పైగా ఖర్చుతో కట్టిన ఆ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. కాగా దగ్గుబాటి వారి వారసుడు రానా కొత్తగా పెళ్లి చేసుకున్నారు. రానా ఇల్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విలాసమైన ఆ భవంతి విశేషాలు ఎన్నో ఉన్నాయట.

విలాసవంతమైన పడకగదులు కలిగిన ఆ ఇంటి నిండా విలువైన ఫర్నిచర్ మరియు కట్టిపడేసే ఇంటీరియర్ డిజైన్. ఇక హోమ్ థియేటర్, రీడింగ్ రూమ్, విశాలమైన కిచెన్ లతో పాటు ఒక వ్యాయామశాల. ఇంట్లోనే రానాకు ఓ విలాసవంతమైన బార్ కూడా ఉందట. అలాగే ఓ కంప్యూటర్ రూమ్ తో పాటు తన ఆఫీస్ కోసం ఓ గదిని కేటాయించారట. ఇక ఇంటిముందు అందమైన మొక్కలతో కూడిన విశాలమైన గార్డెన్ మరియు లాన్. ఇలా అనేక సౌకర్యాలతో రానా ఇల్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని తెలుస్తుంది. కొత్త పెళ్ళికొడుకైన రానా భార్య మిహికా బజాజ్ తో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఆయన షూటింగ్ లో పాలొగొననున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

 

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus