“బాహుబలి” కోసం భారీగా బాడీ పెంచేసిన రాణా బేర్ బాడీ చూస్తే సడన్ గా మనకి టార్జాన్ గుర్తొస్తాడు. అందుకేనేమో రాణా కూడా ఆ తరహా పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ప్రస్తుతం “1947” అనే పీరియాడిక్ లవ్ స్టోరీలో మిలటరీ మ్యాన్ గా నటిస్తున్న రాణా ఆ సినిమా అనంతరం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రంలో నటించేందుకు రాణా సన్నద్ధమవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రంలో రాణా ఓ మావటివాడిగా కనిపించనున్నాడు. ఓ ఏనుగుకి స్నేహితుడిగా రాణా ఈ చిత్రంలో నటిస్తాడట. ఏనుగుతో కలిసి రాణా చేసే ఫీట్స్ ఆడియన్స్ ను అలరిస్తాయని చెబుతున్నారు. ఫారిన్ మూవీస్ “ఆంగ్ బాక్, ఓక్ జా” చిత్రాల తరహాలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇకపోతే.. రాణా ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా సైన్ చేయకపోవడం గమనార్హం. కానీ.. రాణా నటించే ప్రతి సినిమాలో డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజవుతూనే ఉంటుంది.