Rana: ఆ పని చేయడం వల్ల నాన్నతో పెద్ద గొడవ జరిగింది!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రానా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. లీడర్ సినిమా ద్వారా ఈయన హీరోగా పరిచయమై అయ్యారు. అయితే అంతకుముందు ఈయన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీని పెట్టినట్లు తెలిపారు.

ఈ కంపెనీ కారణంగా తన తండ్రితో జరిగిన గొడవ గురించి తాజాగా రానా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఈయన స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థని ప్రారంభించాడు. ఐదేళ్లు పాటు ఆ కంపెనీని నడుపుకుంటూ వచ్చాడు. బాహుబలి వంటి గ్రాఫికల్ వండర్ సినిమాలను చేయాలని అనుకున్నారు. కానీ సాహసం అప్పట్లో చేయలేదు. ఇక ఈ సంస్థను నడపడం రానాకు చాలా ఇబ్బందిగా మారింది.

ఈ కంపెనీని నాలుగు సంవత్సరాల పాటు అతి కష్టం మీద ముందుకు నడిపించినప్పటికీ ఇక తనకు చేతకాక దానిని ప్రైమ్ ఫోకస్ కు అమ్మేశాడు. అలా తాను ఈ సంస్థను అమ్మేయగా అది ఇప్పుడు ప్రపంచంలోనే విఎఫ్ ఎక్స్ కంపెనీగా మారిపోయింది. ఇక ఈ కంపెనీని తాను అమ్మిన సమయంలో తన తండ్రి పెద్ద ఎత్తున గొడవపడ్డారు. దాదాపు నెల రోజులపాటు ఇంట్లో వారందరూ కూడా నన్ను తిడుతూనే ఉన్నారని తెలిపారు.

అయితే ఈ కంపెనీ నడపడం నావల్ల కాళ్ళకి నేను అమ్మేశానని చెప్పిన ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉండేవని నేను ఈ కంపెనీ అమ్మడం వల్ల నాన్న నాతో మాట్లాడటం కూడా కొద్ది రోజులు మానేశాడు అంటూ రానా (Rana) అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags