ప్రభాస్ తరువాత రానా కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోడు అని అంతా అనుకున్నారు. ఎప్పుడు పెళ్లి గురించి రానా ని ప్రశ్నించినా.. ‘నాకు సంసారం బాధ్యతలు ఏమాత్రం తెలీదు. పెళ్ళంటేనే భయమేస్తుంది’ అంటూ కామెంట్స్ చేసి ఎస్కేప్ అయిపోయేవాడు. అలాంటి వాడు ఎవ్వరూ ఊహించని విధంగా ఈవెంట్ మేనేజర్ మిహీక బజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఆగష్ట్ 8న రానా- మిహీక ల వివాహం చాలా సింపుల్ గా జరిగింది.
ఇదిలా ఉండగా..మొదట రానా లవ్ స్టోరీ గురించి పరోక్షంగా కథనాలు వచ్చాయి కానీ.. రానా నేరుగా చెప్పుకొచ్చింది లేదు. అయితే ఇంత కాలానికి నేరుగా చెప్పుకొచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నేహా దూఫియా నిర్వహిస్తున్న ‘నో ఫిల్టర్ విత్ నేహ’ కార్యక్రమంలో రానా పాల్గొని తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.మిహీకా… వెంకటేష్ కూతురు మరియు రానా చెల్లెలు అయిన ఆశ్రితతో కలిసి స్కూల్‌కి వెళ్ళేదట.అప్పటి నుండే ఆమె రానాకు తెలుసట.
అయితే కొంత కాలం తరువాత మిహీక ఫ్యామిలీ హైదరాబాద్ నుండీ ముంబై షిఫ్ట్ అయ్యారట. అయినప్పటికీ రానా..మిహీకకు టచ్‌లోనే వుంటూ వచ్చాడని తెలిపాడు.ఆ చనువుతోనే లాక్‌డౌన్ టైమ్‌లో మిహీకను అలాగే తన ఫ్యామిలీని కలిసి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడట. రానా ముందు నుండీ తెలుసు కాబట్టి మిహీక యస్ చెప్పేసిందట. వీళ్ళ పెళ్ళికి మిహీక ఫ్యామిలీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు రానా తెలిపాడు.