తండ్రి ఓ స్టార్ ప్రొడ్యూసర్.. తన బాబాయ్ ఓ స్టార్ హీరో.. పైగా మూవీ మొఘల్ రామానాయుడుగారి మనవడు. అయినా సరే కమర్షియల్ సినిమాలు తీసేసి.. సేఫ్ గేమ్ ఆడి పెద్ద స్టార్ హీరో అయిపోవాలి అని మన రానా అస్సలు ట్రై చెయ్యలేదు. ‘కమర్షియల్ సినిమాలు చెయ్యడానికి మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్లు ఉన్నారు. నేను కూడా అవే చెయ్యాలి అని నేను ఏనాడూ అనుకోలేదు. ‘ఆఫ్ బీట్’ మూవీస్ అంటేనే నాకు చాలా కిక్ అనిపిస్తుంది.
నటుడుగా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది’ అని అనేక సార్లు రానా చెప్పాడు. అందులో భాగంగానే ‘బాహుబలి'(సిరీస్) లో విలన్ గా నటించాడు. ఆ చిత్రంలో భల్లాల దేవుడు పాత్ర కోసం రానా ఎన్నో వర్కౌట్ లు చేసి వెయిట్ పెరిగాడు.దర్శకుడు రాజమౌళి ఇతనికోసం ఓ ట్రైనర్ ను కూడా ఏర్పాటు చేసి.. భారీగా బాడీ పెంచేలా చేసాడు. అయితే రానా.. అంతకు మించిన కష్టం ‘అరణ్య’ సినిమాకు వచ్చిందని చెప్పాడు. ఈ సినిమా కోసం రానా చాలా వెయిట్ తగ్గాడు.
ఆ పాత్ర కోసం ఎన్నో డైట్ లు చేసి సన్నబడ్డాడట. అడవిలో రక రకాలుగా కింద పడి మట్టిలో షూటింగ్ చెయ్యాల్సి వచ్చిందని రానా తెలిపాడు. అంతేకాదు కొన్ని సన్నివేశాల కోసం ఏనుగు తొండాన్ని భుజాన వేసుకొని నడవాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. దాదాపు 160-170 కేజీల బరువు ఉండే ఏనుగు తొండం మోయడం.. రానాకు చాలా ఇబ్బందిగా అనిపించేదట. ఇక యాక్షన్ సన్నివేశాల కోసం అయితే ఎంతో కష్టపడ్డానని… ‘బాహుబలి’ కోసం కూడా ఇన్ని కష్టాలు పడలేదని రానా తెలిపాడు.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!