అఖిల్ పెళ్లి పై రానా సెటైర్లు..!!

  • July 6, 2016 / 02:02 PM IST

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ ప్రేమ విషయం అక్కినేని అభిమానులను ఆశ్చర్య పరిచినట్లే, సినీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. ఆ విషయాన్ని రానా బహిరంగంగా మాట్లాడి అఖిల్ ని ఆట పట్టించారు. సింగపూర్ లో గత వారం సైమా వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ తారలు హాజరయ్యారు. ఈ వేదికపై ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా అఖిల్ అవార్డు అందుకున్నారు.

అనంతరం అతని స్పందనను తెలియ జేస్తూ ఉండగా రానా వేదికపైకి చేరుకుని.. “నాకు 32 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు. నచ్చిన అమ్మాయి దొరకడం లేదు. నీకు 22 ఏళ్ళు, ప్రేమలో పడడమే కాదు. పెళ్లిదాకా వెళ్ళిపోయావు. పెళ్లి తర్వాత అల్లు అర్జున్ స్నేహితులందరిని మరిచి పోయాడు. నువ్వు కూడా అంతేనా? ” అని అఖిల్ ను అడిగారు. అదే వేదికపై హోస్ట్ గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ రానాకి వంత పాడింది. “నేను అమెరికా నుంచి రాగానే అఖిల్ పెళ్లి అంటూ వార్తలకు షాక్ తిన్నాను” అని మంచు లక్ష్మీ చెప్పగానే అఖిల్ కి ఏమి మాట్లాడాలో తెలియలేదు. పిల్లాడిలా బుంగమూతి పెట్టాడు.

వెంటనే రానా, లక్షి నవ్వేయడంతో వేదికపై వాతావరణం చల్లబడింది. వేడుక చూస్తున్న వారు కూడా అఖిల్ పరిస్థితి చూసి నవ్వుకున్నారు. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోక ముందే ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ ప్రేమలో మునిగిపోవడం అంత అవసరమా అని కొంతమంది అఖిల్ ను ఇండైరెక్ట్ గా విమర్శించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus