టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన రానా దగ్గుబాటి (Rana Daggubati) ఇప్పుడు మరోసారి కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘లీడర్’ (Leader) సినిమాతో హీరోగా పరిచయమైన రానా, తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) లాంటి కొన్ని మంచి సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. అయితే, పూర్తిగా సోలో హీరోగా నిలబడే ప్రయత్నం చేయకుండా విలన్, మల్టీస్టారర్ క్యారెక్టర్లకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంతకు ముందు రానా తేజ (Teja) దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు.
కానీ అనేక కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఓ మాస్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్ కలిగిన కథతో రానా మళ్లీ సోలో హీరోగా తిరిగి రాబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త ప్రయత్నానికి వెనుక కారణం సీనియర్ రైటర్ చిన్నికృష్ణ (Chinni Krishna). చిరంజీవి (Chiranjeevi) ‘ఇంద్ర’ (Indra), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘నరసింహ నాయుడు’ (Narasimha Naidu), రజనీకాంత్ (Rajinikanth) ‘నరసింహ’ (Narasimha), అల్లు అర్జున్ (Allu Arjun) ‘గంగోత్రి’ (Gangotri) వంటి బ్లాక్‌బస్టర్లకు కథలు అందించిన చిన్నికృష్ణ ప్రస్తుతం రానా కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రౌడీ ఎలిమెంట్స్, మాస్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే, కొత్త దర్శకుల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చే ఆలోచనలో రానా ఉన్నట్లు సమాచారం. కొత్త కథపై చర్చలు జరుపుతున్న రానా, ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు రానా ఎంచుకున్న పాత్రలన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కావడంతో, ఆయన మాస్ హీరోగా ఎలా కనిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇక రానా అభిమానులు మాత్రం ఆయన మళ్లీ సోలో హీరోగా వస్తుండటంతో సంబరపడిపోతున్నారు. మరి చిన్నికృష్ణ కథతో రానా నిజంగానే ఓ మాస్ మసాలా బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా అన్నది చూడాలి.