హీరోగా నిరూపించుకోవడానికి శ్రమిస్తున్న రానా

దగ్గుబాటి రానా బాహుబలి చిత్రంలో భల్లాల దేవగా అద్భుత నటన ప్రదర్శించి నటుడిగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఘాజీలోనూ విలక్షణ నటనతో సత్తాచాటారు. ఇప్పుడు కమర్షియల్ హీరోగా నిరూపించుకోవడానికి శ్రమిస్తున్నారు. తేజ్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతోన్న మూవీ నెల క్రితమే షూటింగ్ ప్రారంభించుకుంది. అయినా రానా బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో ఆ ప్రాజక్ట్ ని కొంతకాలం పక్కన పెట్టారు. నిన్నటితో బాహుబలి సెన్సార్ పూర్తి చేసుకోవడంతో రానా కి సమయం దొరికింది. ఇక ఫుల్ టైమ్ ని తేజ కి కేటాయించడానికి సిద్ధమయ్యారు.

‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ నిన్న మొదలయింది. కర్నూలు టౌన్లోని పలు ఏరియాల్లో కొన్ని కీలక సీన్లు చిత్రీకరించారు. ఈ షూటింగ్లో రానా, కాజల్ అగర్వాల్, శివాజీరాజా, ఇతర కీలక నటులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus