సినీ అభిమానుల్ని ఈ ఏడాది ఎక్కువగా ఆకర్షించిన అంశాల్లో మొట్ట మొదటిది అక్కినేని నాగ చైతన్య, సమంతల లవ్ స్టోరీ. ఎన్నో రోజుల పాటు ఊరించిన ఈ విషయం గత నెల రివీల్ అయింది. కింగ్ అక్కినేని నాగార్జున తన కొడుకులు ప్రేమలో ఉన్నారని చెప్పి సస్పెన్స్ కి తెర దించారు. తమ ఇంటి పెద్ద కోడలు సమంత అని చెప్పి చైతూ ప్రేమించిన అమ్మాయి ఎవరో స్పష్టం చేశారు.
అయితే వీరిద్దరి ప్రేమ సంగతి నాగార్జున కంటే దగ్గుబాటి రానాకి ముందే తెలుసంట. ఈ సంగతిని యువసామ్రాట్ రీసెంట్ గా వెల్లడించారు. ‘రానా నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరం కలిసే పెరిగాం. నా ఆలోచనలు, ఇష్టాలను ముందు తనతోనే షేర్ చేసుకుంటాను. అందుకే సమంత విషయం కూడా నాన్న కన్నా ముందే రానాకు తెలుసు’ అని చైతూ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. రానా మాత్రం ఫ్రెండ్ లవ్ విషయాన్నీ పొరబాటున కూడా బయటికి చెప్పకుండా బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నాడు.