తేజ – రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో మీకు తెలిసిందే. అంతేకాదు ఆ సినిమాలో చర్చించిన కొన్ని అంశాలు, చూపించిన రాజకీయాలు కొంతమందికి చెంపపెట్టు అని కూడా అంటుంటారు. అయితేఎవరు స్పందిస్తే వాళ్లు భుజాలు తడుముకున్నట్టు అవుతుంది కాబట్టి ఎవరూ స్పందించలేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే… ఆ కాంబినేషన్‌లో మరో సినిమా ప్లాన్స్ జోరందుకున్నాయి. ఈసారి రాజకీయాలతో మామూలు పంచ్‌లు ఉండవు అంటున్నారు.
‘రాక్షస రాజు’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లోని రెండు కుటుంబాలకు చెందిన నేతల రాజకీయాలను ఈ సినిమాలో చూపిస్తారు అని టాక్ నడుస్తోంది. పవర్ కోసం హత్యలు, కుటుంబంలో రాజకీయాలు లాంటి ఎలుక పిల్లి చెలగాటాలు ఈ సినిమాలో ఉంటాయి అని అంటున్నారు. ఓ లెక్కన చూస్తే… రాక్షసుడి లాంటి రాజును ఈ సినిమాలో చూపిస్తారని టాక్. ‘నేనే రాజు నేనే మంత్రి’లో చూపించిన రాజకీయాలు ఓ మచ్చుతునుక మాత్రమే అంటున్నారు.
‘లీడర్’ సినిమాతో రానా టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ సినిమా చేయలేదు. అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’తో తిరిగి పాలిటిక్స్ జోన్‌లోకి వచ్చాడు. అప్పటి నుండే రానా కెరీర్ ఊపందుకుంది అంటారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ‘రాక్షస రాజు’ కథ ఓకే చేశాడు అంటున్నారు. అందుకే ‘సీత’, ‘అహింస’ లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా తేజను నమ్మారు అని అంటున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తారట.
ఈ సినిమాలో రానాకు సై అంటే సై అనే మరో పవర్ ఫుల్ పాత్ర ఉందట. దీనికి స్టార్ స్టేటస్ ఉన్న నటుడు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అయితే ఆ హీరో సీనియర్ అయి ఉండాలి. అందుకే ఇతర పరిశ్రమల నటులతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక మిగిలిన పాత్రల కోసం బాలీవుడ్ నుండి కూడా తీసుకుంటారని టాక్. అలా పాన్ ఇండియా లుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!