Rana: ప్రభాస్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా రానా చేయాల్సిందా? అసలు ఏమైందంటే?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు (Prabhas) డార్లింగ్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమా ‘డార్లింగ్‌’. ఆ సినిమా పేరు ఆయనకు పెట్టారు అని చెప్పం కానీ… ఆ సినిమా, ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రభాస్‌ ఇమేజ్‌ మారిపోయింది. ఈ లోపు ప్రభాస్‌ కూడా ఫ్యాన్స్‌ను డార్లింగ్‌ అని పిలవడంతో ‘డార్లింగ్‌ ప్రభాస్‌’ అయిపోయాడు. అయితే ఆ పేరు నిజానికి రానాకి (Rana) రావాల్సిందా? ఆ పిలుపు రానా నోట వినాల్సిందా? గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ప్రచారం బట్టి అయితే అవుననే అనిపిస్తోంది.

ప్రభాస్ కెరీర్ ప్రారంభం నుండి మాస్ చిత్రాలు ఎక్కువగా చేశాడు. ఒకట్రెండు ప్రయోగాలు చేసినా తేడాకొట్టాయి. అయితే అదే సమయంలో ‘డార్లింగ్‌’ (Darling) సినిమా అనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. ఆ సినిమా మాస్‌ లవర్‌ ఇమేజ్‌ అందుకున్నాడు. దాంతోపాటు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా భలేగా పెరిగింది. (Tholi Prema) ‘తొలిప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ (Karunakaran) ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమా ఏ రేంజి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే లేటెస్ట్‌ పుకార్ల సారాంశం ఏంటంటే… ఈ సినిమా కథ మొదట రానా దగ్గరకు వెళ్లిందట. రానాతో ఆ సినిమా చేయాలని దర్శకుడు కరుణాకరన్‌ అనుకున్నారట. అయితే ఏమైందో ఏమో ఆ సినిమాను రానా ఓకే చేయలేదట. ఆ తర్వాత కొన్ని రోజులకు కథలో మార్పులు చేసి ప్రభాస్‌ దగ్గరకు వెళ్లగా… అక్కడ ఓకే అయ్యిందట. అలా రానా వద్దనుకున్న కథతో ప్రభాస్‌కి హిట్‌ పడింది. ఆ తర్వాత ఇమేజ్‌ కూడా మారింది అంటున్నారు.

‘డార్లింగ్’ సినిమా తర్వాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్‌’ (Mr Perfect) సినిమా చేయడంతో ప్రభాస్‌ ఇమేజ్‌ మరింత మారింది. డార్లింగ్‌ పదాన్ని ఆ సినిమాలో తెగవాడేశాడు ప్రభాస్‌. ప్రభాస్‌ చేశాడు కాబట్టి బాగుంది, రానాకు సెట్‌ అయ్యేదో లేదో అనే డౌట్స్‌ కూడా కొందరు రెయిజ్‌ చేస్తున్నారు. ఏదైతే ఏముంది రానా ఓ మంచి సినిమా మిస్‌ అయ్యాడన్నమాట.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus