Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

రెంటికీ చెడ్డ రేవడి అనే జాతీయం మీకు తెలుసా? అంటే ఇటువైపు ప్రయత్నించిన పని అవ్వలేదు.. అటువైపు ప్రయత్నించిన పని అవ్వలేదు.. దీంతో ఇబ్బందిపడటం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. అయితే ఇదంతా సమాచారం మాత్రమే. ఆయన మనసులో ఏముందు నిర్మాత నాగవంశీకి కూడా తెలియదు. నిజమేలెండి ఆయనకు త్రివిక్రమ్‌ అన్నీ చెబుతారా ఏంటి? ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ఏం చేస్తారు అనేదే ప్రశ్న.

Karthikeya

మీరు గుర్తుండి ఉంటే చాలా ఏళ్ల క్రితం అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయింది. అప్పుడు సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదని, కానీ ప్రాజెక్ట్‌ సిద్ధమైందని చెప్పారు. ఈ లోపు ఎవరి సినిమాలు వారు చేసుకుంటారు అని చెప్పారు. ఈ లోపు ఆ కథ గురించి చాలా పుకార్లే వచ్చాయి. కార్తికేయుని కథతో ఆ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు బన్నీ సన్నిహితులు. కట్‌ చేస్తే ఎంతకీ సినిమా పనులు మొదలవ్వలేదని తెలిసింది.

ఈలోపు నిర్మాత నాగవంశీ కార్తికేయుని చరిత్రలోని కొన్ని వాక్యాలను ట్వీట్‌ చేస్తూ ఊరించారు. తారక్‌తో ఆ సినిమా ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. కొన్ని రోజులకు తారక్‌ ఏదో పని మీద బయటకు వస్తూ చేతిలో కార్తికేయుని పుస్తకం పట్టుకొని కనిపించి నేనే ఆ సినిమా చేయబోయేది అని చెప్పారు. ఇప్పుడు తారక్‌ కూడా ఆ కథ చేయడం లేదని.. తిరిగి తిరిగి ఆ సినిమా బన్నీ దగ్గరకే వచ్చింది అని చెప్పారు. మొన్నామధ్య అల్లు అర్జున్‌ నుండది ఓ పెద్ద సినిమా ఉంటుంది అని బన్ని వాస్‌ చెప్పారు. అది ఇదేనేమో అనుకుంటే కాదు కాదు అని ఇప్పుడు చెప్పేశారు.

అట్లీతో సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా లోకేశ్ కనగరాజ్‌తో అని చెప్పేశారు. భారీ స్థాయిలో అనౌన్స్‌మెంట్‌ కూడా చేసేశారు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ సినిమా ఎవరితో అనే చర్చ మొదలైంది. వెంకటేశ్‌తో ‘ఏకే 47’ తర్వాత ఆయనేం చేస్తారనేదే ప్రశ్న. చూద్దాం నాగవంశీ నుండి ఏదైనా సర్‌ప్రైజ్‌ ఉంటుందేమో.

 అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus