Rana: నేను కన్న ప్రతి కల ప్రభాస్ నిజం చేసుకుంటున్నాడు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండే హీరోల లిస్ట్ కనుక తీస్తే అందులో ప్రభాస్ రానా కూడా ఉంటారు. వీరిద్దరూ ఎంతో ఒక మంచి స్నేహితులు అయితే బాహుబలి సినిమాలో నటించినప్పటి నుంచి ప్రాణ మిత్రులుగా మారిపోయారు ఒకరినొకరు బావా అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా బాహుబలి సినిమా తర్వాత వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా

రానా (Rana) మాత్రం ప్రభాస్ స్థాయిలో సినిమా అవకాశాలను అందుకోలేకపోయారని చెప్పాలి ఇక ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా కల్కి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రభాస్ కల్కి సినిమా సెట్టుకు వెళ్ళినప్పుడు ప్రభాస్ ఒక సన్నివేశంలో నటిస్తూ కనిపించారు. అయితే ప్రభాస్ నటన చూసి నేను అలాగే నిల్చుకొని చూశాను

అయితే ప్రభాస్ తో మాట్లాడకుండా తిరిగి వెనక్కి వచ్చేసానని తెలిపారు అలా ప్రభాస్ ని చూడగానే నాలో ఏదో తెలియని అసూయ పుట్టింది. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి సినిమాలలో నటించాలి అని కన్న కలలన్నింటిని కూడా ప్రభాస్ నిజం చేసుకుంటున్నారు అంటూ ప్రభాస్ పట్ల తనకున్నటువంటి అసూయను బయటపెట్టారు.

ఇలా ప్రభాస్ ని చూసి అసూయ కలగడంతో అక్కడి నుంచి వచ్చేసానని అయితే ఈ విషయం తిరిగి ప్రభాస్ కి నేను చెప్పడంతో ప్రభాస్ మాట్లాడుతూ బావ నువ్వు అసూయ పడ్డావు అంటే నేను చాలా అద్భుతంగా నటించానని అర్థం అంటూ ప్రభాస్ మాట్లాడారని రానా తెలియజేశారు. ఇది పురాణ ఇతిహాసాల నుండి తీసుకొని సైన్స్ ఫిక్షన్ జోడించిన కథ. ఆ చిత్రం గురించి నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని తెలిపారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus