రానా ఇలా అయిపోవడానికి అసలు కారణం.. అదే..?

  • February 26, 2019 / 04:37 PM IST

ఇటీవల ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో చంద్రబాబు నాయుడు గా ప్రేక్షకుల్ని పలకరించాడు దగ్గుబాటి రానా. త్వరలోనే వేణు అడుగుల డైరెక్షన్లో ‘విరాట పర్వం 1992’ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనించబోతుందట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా రానా ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రానా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడని … అందుకు డోనార్ కూడా దొరికారని త్వరలోనే విదేశాలు వెళ్ళి రానా ఆపరేషన్ చేయించుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రానా కి ఇంకా సర్జరీ అవ్వలేదట.ఇందుకోసం కొందరు వైద్యులు ప్రత్యేకంగా.. రానా ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని తెలుస్తుంది. మెడికేషన్ వలనే రానా ఆరోగ్యాన్ని స్వస్దపరచగలమని… ఇందుకు ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారట. ‘బాహుబలి’ చిత్రం రానాకీ ఎంత క్రేజ్ తెచ్చిందో… ఆ చిత్ర ప్రభావం.. రానా ఆరోగ్యం పై పడిందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం కోసం ఎక్కువ బరువు పెరగడం కూడా రానా ఆరోగ్యం పై ప్రభావం చూపిందట. రానా ప్రస్తుతం ‘స్మోకింగ్’ కూడా మానేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రానా ఆరోగ్యం, సినిమాల పైనే దృష్టి పెట్టాడట. 6 ‘3’ హిట్ ఉండే మన బల్లాల దేవుడు ఇలా డీలా పడిపోవడం విషాదకరమని… ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus