Rana,Atlee: సల్మాన్ తో బాబాయ్.. షారుఖ్ తో అబ్బాయ్..!

బాలీవుడ్ ప్రేక్షకులకు…బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు తెలుగు సినిమా పై ఫోకస్ రాను రాను పెరుగుతూనే ఉంది. అక్కడ తెరకెక్కించే పెద్ద సినిమాల్లో మన తెలుగు నటీనటులు కూడా ఉండాలని భావిస్తున్నారు అక్కడి మేకర్స్. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ లో నాగార్జున నటించారు. అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ లో నాగ చైతన్య కూడా నటించారు.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’ చిత్రంలో వెంక‌టేష్ కీల‌క పాత్ర పోషించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో.. రాంచరణ్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జ‌వాన్’ చిత్రంలో రానా కూడా నటించబోతున్నాడట. ఇదివరకు వరుస పెట్టి హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన రానా ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ ఇచ్చాడు.

‘జవాన్’ చిత్రం ద్వారా మళ్ళీ హిందీలో నటించడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రానాకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది.తమిళంలో, మలయాళంలో కూడా రానా క్రేజ్ సంపాదించుకున్నాడు.అందులోనూ.. షారుఖ్ – అట్లీ కాంబో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి…. రానా మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుఖ్‌ హిట్టు మొహం చూడలేదు. ఆ సినిమా వచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఆ సినిమా మొత్తం సౌత్ ఫ్లేవర్ లో ఉంటుంది కాబట్టి.. హిట్ అయ్యింది. ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో చేసే మూవీ కూడా ఇంచు మించు అలానే ఉండబోతుంది అని వినికిడి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus