Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్
- September 28, 2026 / 07:44 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా విడుదలకు దగ్గరవుతున్న సమయంలో సినిమా టీమ్ ఓ అదిరిపోయే ప్రకటన చేసింది. ఈ సినిమాకు సంబంధించి డాక్యుమెంటరీ సిరీస్‌ని సిద్ధం చేస్తున్నామని, త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ‘రణబాలి: నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ అనే పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యూ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది.
Ranabaali
‘‘మనకు తెలియకుండా చరిత్ర నుంచి కనుమరుగు చేసిన అనేక నిజాల్ని ఈ ‘రణబాలి’ ట్రూత్ సిరీస్ ద్వారా చూపించనున్నాం అని టీమ్ చెప్పింది. ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ పేరుతో ఇప్పటికే యూట్యూబ్‌లో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండగా, 30 వ తేదీన ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’ పేరుతో రెండో ఎపిసోడ్ రిలీజ్ చేస్తారట. ఇక అక్టోబరు 2న ‘ది మెన్ వి ఫర్ గాట్’ అనే పేరుతో మూడో ఎపిసోడ్ వస్తుంది. నాలుగో ఎపిసోడ్‌గా ‘ది లాస్ట్ లోడ్’ వస్తుంది. అయితే ఇది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది ఇంకా టీమ్ చెప్పలేదు.
పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలసి నటించిన తొలి చిత్రం కావడంత అక్టోబర్ 16న రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. మేకింగ్ వీడియోలు, సినిమా బ్యాక్‌స్టోరీలను వీడియోల రూపంలో చెప్పడం ఇదేం కొత్త కాదు. అప్పుడెప్పుడో రాజమౌళి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఈ ట్రెండ్‌ను ఆ తర్వాత పెద్ద సినిమాలు అనిపించుకున్న సినిమాలన్నీ ఫాలో అయ్యాయి. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ కూడా అదే పని చేస్తున్నారు అని చెప్పొచ్చు.
రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ తమదైన జోనర్‌లో అద్భుతంగానే అనిపించాయి. ‘టాక్సీవాలా’ కానీ ‘శ్యామ్ సింగ రాయ్’ కానీ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాల్నే నమోదు చేశాయి. దీంతో ‘రణబాలి’ విషయంలో పెద్ద అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ తన ఫ్లాప్ స్ట్రీక్ నుండి బయటపడతాడని ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్.
















