Ranbir, Alia: బాల్కనీలో పెళ్ళి.. ఆలియా భట్ ఏమందంటే..!

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ గా పేరొందిన ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ లు నిన్న అంటే ఏప్రిల్ 14న చాలా సైలెంట్ గా పెళ్ళి చేసుకుని ఒక్కటయ్యారు. ముంబై, బాంద్రాలో ఉన్న వాస్తు అపార్ట్‌మెంట్‌లో వీరి పెళ్లి జరగడం విశేషం. వీరి పెళ్ళికి ఎక్కువ మంది జనాలు రాలేదు. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరిపెళ్లి జరిగింది. పెళ్ళయ్యాక… ఈ దంపతులు మొదటి ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ..

Click Here To Watch NOW

‘మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నడుమ మాకిష్టమైన ప్రదేశంలోనే మా పెళ్లి జరిగిపోయింది అంటూ కామెంట్ పెట్టారు. ‘గత 5 ఏళ్ళుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో ఆ బాల్కనీలోనే మా పెళ్లి జరగడం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మేమిద్దరం కలిసి బోలెడన్ని మెమోరీస్ ను నిర్మించుకోవడానికి రెడీగా ఉన్నాం’ అంటూ ఆలియా తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది. రణ్‌బీర్‌ కపూర్‌ ఆలియా భట్ ల వివాహం ఎటువంటి లీక్ లు లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోయింది.

ఆలియా భట్ తాత గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండడంతో మనవరాలి పెళ్ళి చూడాలని తపించారు. అందుకే రణబీర్- ఆలియా భట్ లు ఇంత త్వరగా పెళ్ళి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి తోటి నటీనటులైన కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, ఆకాష్‌ అంబానీ,కరణ్‌ జోహార్‌ వంటి స్టార్లు విచ్చేసి ఈ కపుల్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. వీరి పెళ్లి వార్త తెలిసినప్పటి నుండి సోషల్ మీడియాలో అభిమానులు వీళ్ళకి పెద్ద ఎత్తున కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.ఇక వీరి పెళ్ళి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus