Ranbir, Alia: రణబీర్-అలియా భట్ ల పెళ్లి కబుర్లు!

దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్, అలియా భట్ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. బాలీవుడ్ లో వీరి పెళ్లి సంగతులు హాట్ టాపిక్ గా మారాయి. కపూర్ అండ్ భట్ ఫ్యామిలీలో వెడ్డింగ్ అంటే మాములుగా ఉంటుందా..? మరి వీరి వెడ్డింగ్ ఎక్కడ జరగబోతుంది..? ఎలాంటి డిజైనర్ దుస్తులు, నగలు ధరించబోతున్నారు..? రిసెప్షన్ ఎక్కడ..? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 3 గంటలకు అలియా, రణబీర్ ల వివాహం జరగనుంది.

ఇందులో భాగంగా నేడు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మెహందీ ఫంక్షన్ తో వివాహ వేడుకలు మొదలుకానున్నాయి. మరోపక్క అలియా, రణబీర్ పెళ్లి వేడుకలలో భాగంగా రణబీర్ తల్లి నీతూకపూర్, వధువు తండ్రి మహేష్ భట్, రీమా జైన్ ఇలా కుటుంబ సభ్యులు పాలి హిల్ హౌస్‌లో గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సుభాష్ ఘాయ్‌ తన చిన్ననాటి స్నేహితుడు దివంగత నటుడు రిషీకపూర్‌, నీతూ పెళ్లిలో తాను డ్రమ్స్‌ వాయించానని ఇందుకు రాజ్‌కపూర్‌ చాలా సంతోషించారంటూ గుర్తు చేసుకున్నారు.

తన ఆశీస్సులు రణ్‌బీర్‌, అలియాలకి ఎపుడూ ఉంటాయని ఘాయ్‌ తెలిపారు. కొందరు సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ అలియా-రణబీర్ లకు శుభాకాంక్షలు చెబుతూ సినిమాలో సాంగ్ వీడియోను వదిలింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తొందరగా పిల్లలని కను అంటూ రణబీర్ కి సలహా ఇచ్చారట. అలానే వీరి పెళ్లి కబురు విన్న ప్రముఖ డాన్సర్‌ ఫరాఖాన్‌..

అలియా భట్ కు వీడియో కాల్ చేసి అభినందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆర్కే హౌస్ కి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus