Ranbir, Alia: ఆలియాకు రణ్‌బీర్‌ ఇచ్చిన కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇదేనట!

బాలీవుడ్‌ లవ్ బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌ వివాహం ఘనంగా జరిగింది. గురువారం ఇరు కుటుంబాలు, కొద్ది మంది అతిథులు సమక్షంలో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఫొటోలకు పోజులచ్చింది కొత్త జంట. అయితే పెళ్లి సందర్భంగా ఆలియాకు రణ్‌బీర్‌ ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. రూమర్స్‌ ప్రకారం చూస్తే అది డైమండ్‌తో చేసింది అని సమాచారం.

Click Here To Watch NOW

బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌ రణ్‌బీర్‌ – ఆలియాల పెళ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ కపూర్‌.. ఆలియాకు కాస్ట్‌ డైమండ్‌ బ్యాండ్‌ ఇచ్చాడట. అందులో ఎనిమిది డైమండ్స్‌ ఉంటాయని తెలుస్తోంది. వాటి ధర ఎంత అనేది తెలియదు కానీ, ఎనిమిది డైమండ్స్‌ మాత్రమే ఎందుకు ఉన్నాయి అనే విషయంలో మాత్రం ఓ లాజిక్‌ తెలుస్తోంది. రణ్‌బీర్‌కు లక్కీ నెంబరు ఎనిమిదట. అందుకే ఎనిమిది డైమండ్స్‌ ఉండేలా చూసుకున్నారట. ఇక ఆలియా పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ ‘‘గత ఐదేళ్లుగా మేం కూర్చుని ప్రేమించుకున్న బాల్కనీలోనే మా వివాహం జరగడం సంతోషంగా ఉంది’’ అని రాసుకొచ్చింది.

ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుండే అంటే 14 ఏళ్ల వయసులోనే రణ్‌బీర్‌ అంటే ఇష్టం కలిగిందట. రణ్‌బీర్‌ నటనకు పెద్ద అభిమానిగా మారిపోయిందట. ‘రాక్‌స్టార్‌’ ప్రచార కార్యక్రమంలో తొలిసారి రణ్‌బీర్‌తో మాట్లాడిందట. ఆ పరిచయం కాస్తా స్నేహమై, ఆ తర్వాత ప్రేమ చిగురించిందట. అయితే ఇద్దరికీ పెళ్లికి ముందు వేరే వ్యక్తులతో ప్రేమలు – బ్రేకప్‌లు ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. ఆలియా – రణ్‌బీర్‌ ప్రేమ గురించి చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ జోడీ వాటిని ఎప్పుడూ కొట్టి పారేయలేదు. అలా అని అవును అని కూడా అనలేదు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ మొదలైన తర్వాత ‘యస్‌’ అనే సమాధానం చెబుతూ వచ్చారు. కరోనా పరిస్థితులు, ఇంట్లో పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి ఏప్రిల్‌ 14న జరిగింది. ఈ సందర్భంగా కొత్త జోడీకి ఆల్‌ ది బెస్ట్‌ అండ్‌ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ చెబుదాం.

1

2

3

4

5

6

7

8

9

10

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus