Naga Shaurya: నాగశౌర్య అనారోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రంగ బలి డైరెక్టర్!

డైరెక్టర్ బసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం రంగ బలి. మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచిట్రైలర్ లాంచ్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు పలు విషయాల గురించి ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలో (Naga Shaurya) నాగశౌర్య అనారోగ్యానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన పెళ్లి మరొక వారం రోజులు ఉందనగా ఇలా అనారోగ్యానికి గురై ఈయన ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆ రోజు అసలేం జరిగింది అంటూ మీడియా ప్రతినిధులు డైరెక్టర్ ను ప్రశ్నించారు . ఈ క్రమంలోనే డైరెక్టర్ పవన్ నాగ శౌర్య అనారోగ్యం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ…సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ కోసం కొంచెం సిక్స్ ప్యాక్ బాడీ అది చూపించాలని అడిగాను హీరో గారిని. దీంతో ఆ షూట్ కోసం రెండు రోజులు నుంచి వాటర్ తీసుకోవడం మానేశారు అయితే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఈయన కాస్త ఊపిరి గట్టిగా పీల్చుకోవడం గమనించాను దాంతో షూటింగ్ అక్కడికి ఆపివేసి ఆయనని పంపించాము అయితే తను వెళ్ళిన కొంత సమయానికి నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోయారని తెలిసింది.

ఇక ఈయన పడిపోగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాం అతనిని పరీక్షించిన వైద్యులు మరి కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు.ఇలా ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా నాగశౌర్య మిగిలిన షూటింగ్ ఎప్పుడు చేద్దాం అంటూ ప్రశ్నించారు. ఆ మాట విన్నటువంటి ఆయన తండ్రి ఒక్కసారిగా తనపై కోపడ్డారని తెలిపారు.నాగశౌర్య పెళ్లి మరో వారం రోజులు ఉండగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో కుటుంబ సభ్యులందరూ చాలా కంగారు పడ్డారని ఈ సందర్భంగా డైరెక్టర్ తెలిపారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus