Rangabali Trailer: బ‌య‌టి ఊర్లో బాసిన‌స‌లా బ‌తికినా త‌ప్పు లేదు… సొంతూరు సింహంలా బతకాలి!

నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్ వీడియో కూడా అత్యంత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఫన్ రైడ్ గా, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాగశౌర్య సొంతూరు అంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చినా చావు వచ్చిన సొంతూరులోనే అనుకొంటాడు. అలాంటోడికి ఎలాంటి స‌మ‌స్య‌లు, ప్ర‌తిబంధ‌కాలూ ఎదుర‌య్యాయి అనేదే ఈ సినిమా క‌థ‌.

ప్ర‌తి మ‌నిషి పేరు మీద సొంత పొలం ఉండ‌క‌పోవొచ్చు. సొంత ఇల్లు ఉండ‌క‌పోవొచ్చు. కానీ సొంత ఊరు మాత్రం ఉంటుంది..బ‌య‌టి ఊర్లో బాసిన‌స‌లా బ‌తికినా త‌ప్పు లేదు భ‌య్యా.. కానీ సొంతూర్లో మాత్రం సింహంలా ఉండాలి అనే డైలాగ్స్ ఎంతో అద్భుతంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నాగశౌర్య పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

క్యారెక్ట‌రైజేష‌న్ కూడా అల్ల‌రి అల్ల‌రిగానే ఉంటుంది. సొంత షాపు నుంచే దొంగ‌త‌నం చేయ‌డం, ఫ్రెండ్స్ తో స‌రదాగా తిర‌గ‌డం, అమ్మాయిల వెంట పడటం,ఇలా సరదాగా సాగిపోతుంది అలాగే విలన్ ఎంట్రీ ఇవ్వడంతో యాక్షన్స్ సన్ని వేషాలు కూడా అంతే అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా ద్వారా నాగశౌర్య ప్రేక్షకులను మంచిగా ఎంటర్ప్రైన్ చేయబోతున్నారని అర్థం అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus