Rangam Movie: ‘రంగం’ కు 10 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..!

‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి.చౌదరి గారి అబ్బాయి జీవ హీరోగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా.. దివంగత దర్శకుడు కె.వి.ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘రంగం’. 2011 వ సంవత్సరం మే 13న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని మొదట తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ హరీష్ శంకర్ సంగీతం లో రూపొందిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో మెల్ల మెల్లగా సినిమాకి జనాలు వెళ్లడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘ఎందుకో ఏమో’ అనే పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది అనే చెప్పాలి. రెండో వారం నుండీ ఈ చిత్రం మంచి కలెక్షన్లు పెరగడం జరిగింది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.75 cr
సీడెడ్ 2.17 cr
ఉత్తరాంధ్ర 1.95 cr
ఈస్ట్ 0.77 cr
వెస్ట్ 0.62 cr
గుంటూరు 0.67 cr
కృష్ణా 0.71 cr
నెల్లూరు 0.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.27 cr

‘రంగం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నిజానికి ఓ కొత్త హీరో.. అదీ తమిళ్ హీరోకి ఇది ఎక్కువ బిజినెస్ అనే చెప్పాలి. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.11.27 కోట్ల షేర్ ను రాబట్టింది.ఫైనల్ గా బయ్యర్లకు రూ.7 కోట్ల వరకు లాభాలను అందించింది ఈ చిత్రం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus