ఆ సినిమా వల్ల నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో అని భయమేసింది : ‘రంగస్థలం’ మహేష్

‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన మహేష్ ఆచంట.. అటు తర్వాత సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తూ వస్తున్నాడు. ‘శతమానం భవతి’ ‘పాగల్’ వంటి చిత్రాలు ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అలా అని కమెడియన్ గానే ఇతను ఫిక్స్ అయిపోలేదు.ఛాన్స్ దొరికినప్పుడల్లా ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘గుణ 369’ వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. త్వరలో ‘అర్జున పాల్గుణ’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు మహేష్.

డిసెంబర్ 31న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర నా కెరీర్లోనే బెస్ట్ అవుతుంది’ అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. ఇదే క్రమంలో తాను నటించిన ఓ సూపర్ హిట్ సినిమా వల్ల ‘తన ప్రాణాలు కోల్పోతానేమో’ అని భయపడినట్టు కూడా చెప్పి షాక్ కు గురిచేసాడు.

ఆ సినిమా మరేదో కాదు ‘మహానటి’.లెజెండరీ యాక్ట్రెస్, స్టార్ హీరోయిన్ అయిన సావిత్రి గారి జీవిత కథతో రూపొందిన ఈ చిత్రంలో ఆమెను మాయ చేసి ఆస్తులు మొత్తం కొట్టేసే సత్యం పాత్రని పోషించాడు మహేష్.చివరికి ఆమె రోడ్డున పడినా పట్టించుకోకుండా వెళ్లిపోయే సీన్ జనాల మైండ్లో నుండీ అంత ఈజీగా పోదు. ఇక ‘మహానటి’ విడుదలైన తర్వాత మహేష్ తన సొంత ఊరికి వెళ్తే ఇతన్ని తెగ తిట్టారట.

ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ‘నీకేం పోయేకాలం వచ్చింది సావిత్రమ్మని అలా మోసం చేసావ్’ అంటూ పెద్ద వయసున్న వారు మహేష్ ను తిట్టిపోశారట. అంతేకాదు ఆ టైములో కొంత మంది జనాల్ని చూస్తే ‘ఎక్కడ రాళ్లతో కొట్టి చంపేస్తారో’ అని భయపడ్డాడట మహేష్. నిజానికి ‘సావిత్రమ్మని మోసం చేసినోడు బాగానే ఉన్నాడు… వాడిని పక్కన పెట్టి అందరూ నా మీద పడుతున్నారు.వాళ్ళ తప్పు లేదు. ఆ పాత్రకి వాళ్ళు అంతలా కనెక్ట్ అయ్యారు’ అంటూ వివరణ ఇచ్చాడు మహేష్.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus