సాధారణంగా అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదలవుతున్నాయంటే ఆ సినిమాకి సంబంధించిన కథానాయకుడు, దర్శకుడు లేదా ప్రొడ్యూసర్ ‘ఈ సినిమా మీ అంచనాలను తప్పకుండా అందుకుంటుంది లేదా, మీరు అనుకొన్నదానికంటే ఎక్కువగానే సినిమా ఉండబోతోంది’ అంటూ అభిమానుల అంచనాలను పెంచుతుంటారు. కానీ.. విచిత్రంగా ఇవాళ జరిగిన “రంగస్థలం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ “సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా ఒక తెల్ల కాగితంలా సినిమా చూడ్డానికి రండి, ఒక మంచి సినిమా చూశామన్న భావనతో థియేటర్ల నుండి వెళతారు” అని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. నిన్నమొన్నటివరకూ సినిమా ఆ రేంజ్ లో ఉంటుంది, ఈ రేంజ్ లో ఉంటుంది అని చెప్పిన చిత్రబృందం సరిగ్గా రిలీజ్ కి ఒకరోజు ముందు ఈ విధంగా మాట్లాడుతుండడం వల్ల సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.
దీనికి తోడు ఇప్పటికే సినిమా చూసిన కొందరు “సినిమా చాలా యావరేజ్ గా ఉంది” అని రిపోర్ట్ ఇస్తుండడం కూడా మెగా అభిమానులను కలవర పెడుతుంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం సినిమాలోని పాత్రలను పరిచయం చేయడంతోనే అయిపోతుందట. ఇక సెకండాఫ్ లో డ్రామా బాగా ఎక్కువైందని, అది జనరల్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కదని వినికిడి. అలాగే.. క్లైమాక్స్ లో సెంటిమెంట్ డోస్ మరీ ఎక్కువైందని కూడా అంటున్నారు జనాలు. సో, ఓవరాల్ గా “రంగస్థలం” సినిమాపై భారీ నెగిటివ్ టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. మరి సినిమా సంగతేంటి అనే విషయం కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.