అర్.అర్.అర్ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో ఏ రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిందో చెప్పడానికి రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం వసూళ్లను చూసి చెప్పొచ్చు. జులై 14 వ తేదీన ఈ సినిమాని జపాన్ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 4 మిలియన్ జపనీస్ డాలర్స్ వచ్చాయి .
రెండున్నర వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఈ ఏడాది విడుదలైన ఇండియన్ సినెమాలు అన్నిట్లో ఆల్ టైం రికార్డు అని జపనీస్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొదటి రోజు కంటే కూడా రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా బాగున్నాయి. ఊపు చూస్తూ ఉంటే ఈ చిత్రం మరో ఆర్.అర్.అర్ అవ్వబోతుందా? అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రామ్ చరణ్ కెరీర్ లో రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రావొచ్చు కానీ, ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రం మాత్రం ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్. యాక్టింగ్ పరంగా ఈ చిత్రం రామ్ చరణ్ లోని విశ్వరూపాన్ని బయటకి తీసింది. ఆయనని గతం లో విమర్శించిన వాళ్ళే ఈ సినిమాని చూసి సెల్యూట్ చేసారు. ఆరోజుల్లోనే ఈ చిత్రం 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టింది.
అయితే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తే, వసూళ్ల పరంగా సునామి సృష్టిస్తుందని అభిమానులు సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేసి ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. వారి కోరికలకు మొత్తానికి జపాన్ రిలీజ్ ద్వారా తెరపడింది. త్వరలోనే చైనా కూడా విడుదల చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!