పెళ్లి చేసుకున్న నితిన్ బ్రతుకు బస్టాండ్ అయ్యింది

యంగ్ హీరో నితిన్ నేడు బ్యాచ్ లర్ లైఫ్ కి టాటా చెప్పి ఫ్యామిలీ మెన్ కాబోతున్నాడు. ఆయన చిరకాల ప్రేయసి షాలిని మెడలో ఈ రోజు రాత్రి ఆయన మూడు ముళ్ళు వేయనున్నాడు. కాగా ఈ వేడుకను పురస్కరించుకొని ఆయన లేటెస్ట్ మూవీ రంగ్ దే టీజర్ విడుదల చేశారు. దాదాపు నిమిషం ఉన్న రంగ్ దే టీజర్ ఎంటర్టైనింగ్ గా సాగింది. టీజర్ చూస్తుంటే ఇది పక్కా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నితిన్ కాలేజ్ లైబ్రరీలో పుస్తకాల పురుగులా పరిచయం చేశారు.

ఇక తన ఇంటిలోనే ఉండే బంధువుల అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది. కానీ కీర్తి సురేష్ అంటే నితిన్ కి ఏమాత్రం ఇష్టం లేదు. కీర్తి మాత్రం నితిన్ ని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. నితిన్ వద్దంటున్నా, కీర్తి ఎందుకు కావాలనుకుంటుంది, నితిన్ కీర్తిని ఎందుకు వద్దనుకుంటున్నాడు అనేది ఆసక్తికర అంశం. అలాగే కీర్తి అంటే నితిన్ కి ఇష్టం లేదా, పెళ్లి అంటే ఇష్టం లేదా అనేది కూడా మరో పాయింట్. చివరకు నితిన్, కీర్తిని పెళ్లి చేసుకున్నట్లు, ఆ పెళ్లి వలన నితిన్ లైఫ్ లో చిన్న చిన్న కష్టాలు మొదలైనట్లు టీజర్ ముగించారు.

మొత్తంగా టీజర్ లో దర్శకుడు వెంకీ అట్లూరి అనేక ఫజిల్స్ వదిలారు. ఏదిఏమైనా టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. టీజర్ మూవీపై అంచనాలు పెంచేలా ఉంది. దేవిశ్రీ బీజీఎమ్ టీజర్ లో మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతికి విడుదల చేస్తాం అంటున్నారు.


పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus