‘కాంతార’ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా నటించిన ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ సూపర్ హిట్ అయిన 2 ,3 వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు సాధించింది. తర్వాత దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతార 2’ కూడా హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
విషయంలోకి వెళితే.. ఇటీవల గోవాలో జరిగిన IFFI వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ అలాగే ‘కాంతార’ హీరో, దర్శకుడు అయినటువంటి రణ్వీర్ సింగ్ పాల్గొన్నాడు. రణ్వీర్ సింగ్ స్పీచ్ ఇస్తున్న టైంలో..‘కాంతార’ సినిమా గురించి, రిషబ్ నటన గురించి కొన్ని వెటకారపు కామెంట్లు చేశాడు. ‘కాంతార’ అద్భుతం.. అందులో రిషబ్ శెట్టి నటన అద్భుతమంటూనే.. సినిమాలో రిషబ్ శెట్టికి పూనకం వచ్చినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని వెటకారంగా ఇమిటేట్ చేశాడు.
అలాగే ‘కాంతార 3’లో కనుక తనను చూడాలనుకునే అభిమానులు ఉంటే రిషబ్ శెట్టి ఇక్కడే ఉన్నాడు. అతన్ని నిలదీయండి అంటూ రణ్వీర్ సింగ్ కామెంట్స్ చేశాడు. ‘కాంతార’ సినిమాలో పంజుర్లీ దేవత సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయి. ‘కాంతార’ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి కారణం సినిమాలో ఉన్న దైవత్వమే అనడంలో సందేహం లేదు. అలాంటి సన్నివేశాలను వక్రీకరిస్తూ.. హాస్యాస్పదంగా రణ్వీర్ చేసిన కామెంట్స్ పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. తక్షణమే రణ్వీర్ క్షమాపణలు తెలుపాలని డిమాండ్ చేస్తున్నారు.
‘కాంతార’పై రణ్వీర్ కామెంట్స్.. క్షమాపణలు డిమాండ్ చేస్తున్న కన్నడిగులు
సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రంలోని పంజుర్లీ దేవత సన్నివేశాలపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో రణ్వీర్… pic.twitter.com/nYMfNl7eNK
— ChotaNews App (@ChotaNewsApp) November 30, 2025