రావు రమేష్…బెస్ట్ చాయ్స్!!!

  • June 6, 2016 / 07:00 AM IST

టాలీవుడ్ లో సీరియస్ విలన్స్ గా, కామెడీ విలన్స్ గా,  ఇంకా చెప్పాలి అంటే సెంటిమెంట్ ను సైతం పండించే విలన్ గా అటు షియాజీ షిండే, శ్రీహరి, తమిళ స్టార్ ప్రభు, మన ప్రకాష్ రాజ్ ఉండేవారు. అయితే ఇప్పటికీ వారికి డిమాండ్ ఉన్నప్పటికీ…దర్శకులు మాత్రం మాకు ఫర్స్ట్ చాయిస్ మన రావు గారి అబ్బాయి, రావు రమేష్ అంటున్నారు…2008లో గమ్యం సినిమాలోని నక్సలైట్ పాత్రతో మలుపు తిరిగిన రావు రమేష్ కెరియర్….అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెడుతోంది. పాపులార్టీతో పాటు అవకాశాలు పెరుగుతుంటే.. అవకాశాలొస్తున్న కొద్దీ రెమ్యనరేషన్ కూడా పెంచుతున్నాడట రావు. అయినాసరే ఆయనే కావాలి అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.

అదే క్రమంలో తాజాగా విడుదలయిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా…సినిమాలో ఆయన పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి….బ్రహ్మోత్సవం సినిమాలో ఎప్పుడూ సీరియస్ గా బామ్మర్ది పాత్రలోనైనా.. అ..ఆ సినిమాలో కామెడీ చేసే విలన్ పాత్రలోనైనా ఈ యువ కామిడీ విలన కుమ్మెసాడు అంతే. అయితే అప్పట్లో ఇలాంటి పాత్రలకు ప్రాణం పోయడానికి ప్రకాష్ రాజ్ అని ఒకడు పుట్టాడు అని అందరూ అనుకునే వారు…. ఇక ఈ మధ్య కాలంలో జగ్గు భాయ్ సైతం రంగంలోకి దిగాడు. అయితే ఇంత పోటీను తట్టుకుని ఈ రావు గారి వారసుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.. ఎంతైనా…విలక్షణ నటుడి వారసుడు కదా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus