Rashi Khanna: రాశి ఖన్నా.. మిస్ ఫైర్ అయితే కష్టమే..!

టాలీవుడ్ లో బబ్లీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాశి ఖన్నా (Raashi Khanna)  ప్రస్తుతం సక్సెస్ కోసం మరింత కష్టపడుతోంది. తెలుగులో చేసిన చిత్రాలు ఇటీవల విజయవంతం కాకపోవడంతో ఆమె ఇప్పుడు తన ఫోకస్ ని తమిళ్, హిందీ సినిమాలపై పెట్టింది. తెలుగులో ఆమె చివరిసారిగా చేసిన ‘థాంక్యూ’ (Thank You) మరియు ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో రాశి తన కెరీర్ లో మరింత పటుత్వం కోసం ఇతర ఇండస్ట్రీలపై దృష్టి సారించింది.

Rashi Khanna

తమిళ్ లో ‘తిరు’ (Thiruchitrambalam) , ‘సర్దార్’ (Sardar), ‘అరణ్మణై 4’ (Aranmanai 4) వంటి చిత్రాలతో మంచి విజయాలను సాధించింది. అలాగే హిందీలో ‘యోధ’ (Yodha) చిత్రం ద్వారా బాలీవుడ్ లో తిరిగి ప్రవేశించినా, ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఓటీటీలో ‘రుద్ర’, ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్ లు రాశి ఖన్నా కి మంచి పేరు తెచ్చాయి. ఇవి ఆమెకు హిందీ పరిశ్రమలో కొంత గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా రాశి ఖన్నా హిందీలో విక్రాంత్ మాస్సే తో కలిసి నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించాలని ఆశ పడుతోంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై రాశి చాలా ఆశలు పెట్టుకుంది, ఎందుకంటే ఈ సినిమా విజయవంతం అయితే బాలీవుడ్ లో ఆమె కెరీర్ కి మరింత స్థిరత్వం లభిస్తుందని భావిస్తోంది. తెలుగులో కూడా రాశి ఖన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘తెలుసు కదా’ అనే చిత్రంలో సిద్దు జొన్నలగడ్డతో జతకడుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

అలాగే తమిళంలో ‘అరణ్మణై 5’, ‘అగత్యా’ చిత్రాలలో నటిస్తోంది. ఈ చిత్రాలు కూడా రాశి ఖన్నా (Rashi Khanna) కెరీర్ కి బలమైన బూస్ట్ ఇస్తాయని ఆమె ఆశిస్తోంది. హిందీలో ఆమె నటించిన ‘TME’ చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆమె సౌత్ లో సక్సెస్ అయితే సాధించినా, హిందీలో ఇప్పటి వరకు సరైన గుర్తింపు పొందలేదు. ‘ది సబర్మతి రిపోర్ట్’ విజయం సాధిస్తే ఆమె బాలీవుడ్ లో తగిన స్థానం పొందుతుందని ట్రేడ్ పండితులు కూడా ఆశిస్తున్నారు.

ఒక్క అభిమాని చేసిన కామెంట్ వల్ల.. నాగ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus