17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

‘3 రోజెస్’ వెబ్ సిరీస్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే దానికి సీక్వెల్ కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ సీక్వెల్ లో ఈషా రెబ్బా తో పాటు కుషిత కళ్ళపు, రాశీ సింగ్ కూడా నటిస్తున్నారు. వీళ్ళ పాత్రలు చాలా బోల్డ్ గా ఉంటాయని ప్రమోషనల్ కంటెంట్ తో చెప్పకనే చెప్పారు. డిసెంబర్ 12న ‘3 రోజెస్ సీజన్ 2’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్ కె ఎన్ తో టీం సరదాగా ముచ్చటించింది.

Rashi Singh

ఈ క్రమంలో రాశీ సింగ్ తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి చెప్పి హైలెట్ గా నిలిచింది.రాశి సింగ్ మాట్లాడుతూ..”నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఒక లెక్చరర్ ని ప్రేమించాను. అతను నాకు చాలా ఫేవర్స్ చేసేవాడు. ఎగ్జామ్స్ టైంలో నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు. అలాగే వైవా వంటి సెషన్స్ లో నాకు క్వశ్చన్స్ వేయడం కాకుండా.. నాతో కబుర్లు చెప్పేవాడు. అప్పుడు నా వయస్సు 17 ఏళ్ళు.

ఆ టైంలో అతనికి పెళ్ళికాలేదు. కానీ ఇప్పుడు అతనికి పెళ్లైపోయింది. అయినప్పటికీ ఇప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవుతున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఆ వెంటనే పక్కనే ఉన్న నిర్మాత ఎస్ కె ఎన్.. ’17 ఏళ్ళ వయసులో అంటే మీరు ఇంకా మేజర్ కూడా కాలేదు. ఆ టైంలో ‘కోర్టు’ లో మంగపతి(శివాజీ) లాంటి మావయ్య మీకు ఉండుంటే.. మీ పని చెప్పేవాడు’ అంటూ సెటైర్ విసిరాడు. ఒకరకంగా ‘కోర్టు’కి సీక్వెల్ లాంటి ఐడియా అనే ఆలోచన అతనిది కావచ్చు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus