Rashmi: గుండె బరువెక్కిందంటూ రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్…!

కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించిన రష్మీ..నటిగా సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ‘జబర్దస్త్’ తో ఆమె దశ తిరిగింది. ‘జబర్దస్త్’ కు అనసూయ హైలెట్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కు రష్మీ హైలెట్ అన్నట్లు ఉండేది. మొదట్లో వచ్చీరాని తెలుగులో మాట్లాడి.. తర్వాత సుధీర్ తో ప్రేమాయణం వంటి వార్తలతో రష్మీ ఇమేజ్ బాగా పెరిగింది. తర్వాత బుల్లితెర పై వరుస షోలలో పాల్గొంటూనే మరోపక్క సినిమాల్లో కూడా అడపాదడపా నటిస్తూ వస్తోంది రష్మీ.

సోషల్ మీడియాలో కూడా రష్మీకి ఫాలోయింగ్ ఎక్కువే.ఇదిలా ఉండగా.. తాజాగా రష్మీ షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. యాంకర్ రష్మీ ఇంత విషాదం చోటు చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్లో గుండె బరువెక్కింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కొంత ఆవేదన చెందారనే చెప్పాలి. విషయం ఏంటంటే.. ‘రష్మీ గ్రాండ్ మదర్ అయిన ప్రవీణా మిశ్రా నిన్న అంటే శుక్రవారం నాడు(జనవరి 21 2023) న మరణించినట్టు ఆమె తెలిపింది.

ఈ చేదు వార్తను ఇలా పంచుకోవాల్సి వస్తుందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా అతన గ్రాండ్ మదర్ తో ఉన్న అఫెక్షన్ ను ఆమె వ్యక్తం చేసింది. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమైన మేమంతా ఆమెకు నివాళులు అర్పించాము. ఆమె చాలా ధైర్యవంతురాలు. స్ట్రాంగ్ విమెన్. ఆమె భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని.. ఉండాలని ఆశిస్తున్నట్టు రష్మీ పేర్కొంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus