మరో “యాంగిల్” చూపిస్తానంటున్న రేష్మి

జబర్దస్థ్ టీవీ షో పుణ్యమా అంటూ పాప్యులర్ అయిన యాంకర్ రేష్మి ఆమె టీవీలకు రాక ముందు ఒక సినిమా చేసింది అయితే ఆ సినిమా వచ్చి వెళ్లినట్లు పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో అటువైపు పెద్దగా పట్టించుకోలేదు. ఇక జబర్దస్థ్ లో ఆమె హాట్ యాంకరింగ్ కి ఫిదా అయిపోయిన టాలీవుడ్ ఆమెకు ఒక అవకాశం కల్పించింది. ‘గుంటూర్ టాకీస్’ పేరుతో వస్తున్న సినిమాలో ఆమె ప్రధాన హీరోయిన్ పాత్రను పోషిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సంధర్భంలో  ప్రమోషన్ లో భాగంగా ఆమె హాట్ స్టిల్స్ ను ఈ చిత్రం విడుదల చేసింది. రకరకాల భంగిమల్లో అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేష్మి, ఈ సినిమాకు అంత అవసరమా, అంటే ఆమె ఇచ్చిన సమాధానానికి మీడీయ అవాక్కయ్యింది. అంటే ఆమె సమాధానం అంత హాట్ గా ఉంది. ఇంతకీ ఆ పాత్ర గురించి ఆమె ఏం చెప్పిందంటే…ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సువర్ణ అని, ఆ సువర్ణ పాత్ర కోసం అందాలు ఆరబోయడం తప్పేం కాదని అంతేకాకుండా అసలు హాట్ గా కనిపించకుండా స్టార్ అయిన వారిలో కనీసం హీరోయిన్ అయినవారినో ఒక్కరినైనా చూపించాలని నిలదీసేసింది కూడా.

ఇప్పుడు టీవీ యాంకర్లయినా సినిమా హీరోయిన్లయినా ఈ రూట్ పట్టక తప్పదని తేల్చేసింది రష్మీ. ఇక మరో పక్క తన వచ్చే సినిమాలో నా టాలెంట్ ఓపెన్ చేస్తా అని, మరో సరికొత్త అవతారం చూపిస్తాను అని ఆమె తెలిపింది. ఇన్ని యంగిల్స్ లో మరో యాంగిల్ అంటే ఎంటా అని మీడియా ఆలోచనలో పడింది. చూద్దాం మరో మన రేష్మి మేడమ్ ఏ యాంగిల్ చూపిస్తుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus