నటుడు సిద్ధార్థ్ శుక్లాతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని చెబుతోంది రష్మీ దేశాయ్. హిందీలో ప్రసారమైన ‘బిగ్ బాస్’ సీజన్ 13తో ప్రేక్షకులకు దగ్గరైన బుల్లితెర నటి రష్మీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. రియాలిటీ షో విజేత సిద్ధార్థ్ శుక్లా గురించి మాట్లాడుతూ.. అతడితో ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది. సిద్ధార్థ్ శుక్లా తను కలిసి మొదట్లో బుల్లితెరపై ప్రసారమయ్యే ‘దిల్ సే దిల్ తక్’ అనే కార్యక్రమం చేశామని.. అలానే ఇటీవల సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాలిటీ షోలో కూడా పాల్గొన్నామని.. అయితే రియాలిటీ షోలో ఉన్నప్పుడూ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవని చెప్పింది.
కానీ షో పూర్తయిన సమయానికి తనతో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉండడంతో ‘దిల్ సే దిల్ తక్’ షో చేస్తున్న సమయంలో గొడవ పడేవాళ్ళమని.. సిద్ధార్థ్ ఎప్పుడూ తనకు పదేళ్ల కుర్రాడిలానే కనిపిస్తుంటాడని తెలిపింది. ఇద్దరి మద్య ఉన్న గొడవలను పక్కన పెడితే వృత్తిపరంగా ఇద్దరం చాలా ప్రొఫెషనల్ గా ఉంటామని..రియాలిటీ షో చివర్లో ఫ్రెండ్స్ అయినప్పటికీ కొట్టుకోవడం మాత్రం మానలేదని సరదాగా చెప్పుకొచ్చింది.