Rashmika: లిప్ లాక్ సన్నివేశాలపై రష్మిక మందన ఎమోషనల్ కామెంట్స్..!

రష్మిక నటించిన ‘పుష్ప’ ‘సీతా రామం’ చిత్రాలు ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.నిజానికి స్ట్రైట్ హిందీ మూవీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది రష్మిక. కానీ కోవిడ్ వల్ల ఆ ప్లాన్ లో మార్పు చోటుచేసుకుంది. అయితే రష్మిక మందన కి మాత్రం మంచి ఫలితాలు అందాయి. ఇక ఆమె హిందీలో నటించిన ‘గుడ్ బై’ చిత్రం అక్టోబర్ 7న విడుదల కాబోతుంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించారు.

ఈ చిత్రం ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది రష్మిక. ఆల్రెడీ నేషనల్ క్రష్ అనే ముద్ర ఈమెపై పడిపోయింది కాబట్టి.. అక్కడి మీడియా మొత్తం ఈమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతుంది. ఈ క్రమంలో రష్మిక లిప్ లాక్ సన్నివేశాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. ” నేను చాలా సున్నితమైన మనస్కురాలిని.గతంలో నేను చేసిన ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల టైంలో చాలా ట్రోలింగ్ ను ఫేస్ చేశాను.

ఈ రెండు సినిమాల్లోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి.’గీత గోవిందం’ ఎలా ఉన్నా.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం టైంలో నేను చాలా ట్రోలింగ్ ను ఫేస్ చేశాను. విజయ్ తో నేను కావాలనే పబ్లిసిటీ కోసం అలాంటి సన్నివేశాల్లో పాల్గొన్నానని ఘోరమైన కామెంట్స్ చేసేవారు.

ఆ టైంలో నేను ఆ ట్రోలింగ్ ను ఎలా భరించానో, ఎలా అధిగమించానో నాకే తెలీదు.ఆ టైములో చాలా పీడకలలు వచ్చేవి. అర్ధరాత్రి లేచి నేను బెడ్ పై ఏడ్చేసేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus