Rashmika: పుష్ప ది రూల్ పై అంచనాలు పెంచేసిన రష్మిక.. చెప్పిన విషయాలివే!

పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ తో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. హీరోయిన్ రష్మిక ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ సినిమా కోసం స్పెషల్ గా ప్రిపేర్ కావడం కుదరదని ఆమె తెలిపారు.

పుష్ప2 మూవీ షూటింగ్ లో ప్రతిరోజూ ఒక కొత్త అనుభవం అని చెప్పుకొచ్చారు. పుష్ప2 సినిమా కోసం చేసిన చాలా సీన్స్ లొకేషన్స్ లో అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి చేసిన సీన్స్ అని ఆమె తెలిపారు. ముందుగా సిద్ధమవ్వడం కుదరదని ప్రతిరోజూ దేనికదే ప్రత్యేకం అని రష్మిక వెల్లడించారు. ఏరోజుకు ఆరోజు ది బెస్ట్ ఇవ్వడమే అని ఆమె కామెంట్లు చేశారు. పుష్ప2 సినిమాలో పుష్పరాజ్ భార్య పాత్రలో కనిపిస్తానని రష్మిక పేర్కొన్నారు.

పుష్ప ది రూల్ సినిమాలో నా చుట్టూ లవ్ సీన్స్ ఉంటాయని రష్మిక చెప్పుకొచ్చారు. పుష్ప ది రూల్ లో నా రోల్ చుట్టూ చాలా డ్రామా తిరుగుతుందని మరింత మసాలా ఉండబోతుందని ఆమె వెల్లడించారు. పుష్ప2 సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేస్తారని ఆమె వెల్లడించారు. ఇటీవల ఒక సాంగ్ షూట్ పూర్తైందని రష్మిక పేర్కొన్నారు. త్వరలో మరో సాంగ్ షూటింగ్ లో కూడా పాల్గొంటానని రష్మిక చెప్పుకొచ్చారు.

రష్మిక కామెంట్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రష్మిక పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పలు ప్రముఖ కంపెనీలకు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రష్మిక సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో సైతం రష్మిక నటిస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus