Pushpa Movie: పుష్పను ఆ మూవీ భయపెడుతోందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బన్నీకి జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయినా రష్మిక పాత్ర గురించి తెలియలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక పుష్ప సినిమాలో తన పాత్ర గురించి కీలక విషయాలను వెల్లడించారు.

పుష్ప మూవీలో తన పాత్ర కొత్తగా ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చారు. తాను ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని దర్శకుడు సుకుమార్ తన పాత్రను ఆసక్తిగా ఉండేలా క్రియేట్ చేశారని రష్మిక తెలిపారు. తాను పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తూ ఉండటంతో ప్రేక్షకులు ఈ పాత్రకు వెంటనే కనెక్ట్ అవుతారని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్రలో నటించలేదని రష్మిక వెల్లడించారు. పుష్ప పార్ట్ 1తో పాటు పార్ట్ 2లో కూడా తన పాత్ర ఉంటుందని రెండు భాగాల్లో కనిపించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయమని ఆమె అన్నారు.

పుష్ప భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రష్మిక అభిప్రాయపడ్డారు. అయితే రష్మిక పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన సుల్తాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న పుష్ప రిజల్ట్ విషయంలో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సుల్తాన్ మూవీ రిజల్ట్ సెంటిమెంట్ పుష్ప మూవీని భయపెడుతుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus