Rashmika,Rishab Shetty: మరోసారి రష్మికకు కౌంటర్ ఇచ్చిన రిషబ్…ట్వీట్ వైరల్!

కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈయన పేరు మారు మోగిపోతుంది. అయితే ఈ సినిమా అనంతరం నటి రష్మికకు, రిషబ్ శెట్టికి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.అయితే వీరిద్దరి మధ్య ఇదే వివాదం ఇంకా కొనసాగుతుందని తాజాగా రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కిరిక్ పార్టీ.

ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీకి విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి గుర్తుచేసుకొని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ రష్మికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టు అయింది. కిరిక్ పార్టీ విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మా సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మా కోసం మీరు చేసిన సందడి థియేటర్లో వేసిన విజిల్స్ ఇప్పటికీ మా చెవులలో మారుమోగుతున్నాయి.

మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లాయి. ఈ వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఈయన ట్విట్ చేశారు. రిషబ్ శెట్టి చేసినటువంటి ఈ ట్వీట్ కి హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లోకనాథ్ ను ట్యాగ్ చేశారు.

ఇక ఈయన మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన రష్మికను టాగ్ చేయకుండా ఉండడంతో మరోసారి రష్మికకు ఈట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus