పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నకు(Rashmika Mandanna)ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కే అవకాశం వచ్చింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దూసుకెళ్లిన రష్మిక ఇప్పుడు డిస్నీ సంస్థ నిర్మిస్తున్న హాలీవుడ్ ఫ్యాంటసీ చిత్రం లిలో అండ్ స్టిచ్ కోసం భారత్‌లో ప్రమోషనల్ ఫేస్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని దాదాపు 100 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అంటే 860 కోట్లకు పైగా వ్యయం చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రెస్, సోషల్ మీడియాలో రష్మికే ముఖ్యమైన చిహ్నంగా నిలవనుంది.
ఇప్పటికే యానిమల్ (Animal), పుష్ప 2(Pushpa 2: The Rule), చావా (Chhaava) లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించిన రష్మిక, వరుస విజయాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌గా నిలిచింది. పుష్ప 2, 1800 కోట్ల వసూళ్లు సాధించగా, యానిమల్, చావా సినిమాలు కలిపి 1600 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న రష్మికను డిస్నీ వంటి ప్రఖ్యాత సంస్థ భారత మార్కెట్ టార్గెట్‌గా ఎంచుకోవడం సహజమే. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక పోస్ట్ చేసిన ప్రోమో వీడియోలో ఆమె లిలో పాత్రలో కనిపించగా, స్టిచ్ అనే గ్రహాంతర స్నేహితుడికి దత్తత తల్లి పాత్రలో ఆమె మాయ చేయించింది.
ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతుండటంతో, దక్షిణ భారత ప్రేక్షకులలో సినిమాపై మంచి హైప్ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఈ సినిమా 2D మరియు 3D వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ వర్షన్‌కు సాంకేతికంగా టాప్ లెవెల్ స్టాండర్డ్ ఉన్నా, భారతీయ మార్కెట్‌ను ఆకట్టుకోవడం కోసం రష్మిక వంటి ఫేస్ అవసరం అనిపించినట్టు స్పష్టమవుతోంది.
ఇండియాలో ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన రష్మిక, ఇప్పుడు డిస్నీ తరపున మరో అంతర్జాతీయ గుర్తింపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడేం, అభిమానులు మాత్రం హాలీవుడ్‌కి రష్మిక జంప్ చేయబోతుందా? అన్న ప్రశ్నలతో హాట్ టాపిక్‌గా మార్చేశారు. డిస్నీ లాంటి సంస్థతో భాగస్వామ్యం అంటే, అది ఆమెకు భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ ఛాన్సులు తెచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ‘లిలో అండ్ స్టిచ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాలి.