Rashmika: తన రోల్ పై క్లారిటీ ఇచ్చిన రష్మిక.. ఏమన్నారంటే?

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప2 సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సుకుమార్ కు దర్శకునిగా మరింత మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప ది రైజ్ లో రష్మిక శ్రీవల్లి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.

శ్రీవల్లి పాత్ర పరిమితమే అయినా ఆమె తన నటనతో ప్రశంసలు పొందడంతో పాటు తన పాత్రకు న్యాయం చేశారు. అయితే రష్మిక పాత్ర నిడివి తక్కువగా ఉందని కొంతమంది కామెంట్లు చేశారు. అయితే పుష్ప ది రూల్ లో మాత్రం రష్మిక పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా డీ గ్లామరస్ రోల్స్ లో కనిపించడానికి హీరోయిన్లు సిద్ధపడరు. అయితే రష్మిక మాత్రం శ్రీవల్లి రోల్ కోసం తనకు తాను పూర్తిగా మార్చుకున్నారు.

తాజాగా ఒక నెటిజన్ పుష్ప ది రూల్ లో రష్మిక రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అతని కామెంట్ కు రష్మిక స్పందిస్తూ పుష్ప ది రూల్ లో శ్రీవల్లి పాత్ర అంతకు మించి ఉంటుందని ఆశిద్దామని చెప్పుకొచ్చారు. రష్మిక తన కామెంట్ల ద్వారా పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. పుష్ప ది రూల్ సినిమాతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందేమో చూడాలి.

పుష్ప ది రూల్ లో కథనంతోనే మ్యాజిక్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి సినిమా ఉండే విధంగా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ కలెక్షన్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus