తమ నిశ్చితార్ధం రద్దుపై స్పందించిన రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం తెలుగు అభిమాన నటిగా మారిపోయింది. “ఛలో” చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఆమె “గీత గోవిందం” చిత్రంలో గీతగా నటించింది. విజయ్‌ దేవరకొండతో పోటీపడి నటించి మంచి మార్కులు అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “తెలుగులో నేను చేసిన తొలి చిత్రం ‘ఛలో’. అది హిట్. నా రెండో సినిమా ‘గీత గోవిందం’కు కూడా మంచి టాక్‌ వస్తోంది. ఇందులో గీత పాత్రలో బాగా చేశానని అంటున్నారు. ఈ సినిమాలో కొంతమంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ వారెవ్వరూ ఒప్పుకోలేదట.’ ‘నేను ఒప్పుకోవడానికి ప్రత్యేక కారణమంటూ లేదు. ఇతర హీరోయిన్లు ఇందులో చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదో నాకు తెలీదు కానీ నాకు మాత్రం పాత్ర చాలా నచ్చింది.”

అని తెలిపింది. ఇక రక్షిత్‌ శెట్టితో బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ ” నాకు రక్షిత్‌ కి మధ్య దూరం పెరిగిందని, నిశ్చితార్థం రద్దు అయిందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. నేను విన్నాను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరి మధ్య క్లారిటీ ఉంది. నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ రెండేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నాం. మేం ఈ నిర్ణయం తీసుకుని ఏడాదే అవుతోంది. మరో ఏడాది ఉంది కదా? అందుకే ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నాం. పెళ్లయ్యాక కూడా తప్పకుండా నటిస్తాను” అని రష్మిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె నాగార్జున, నాని నటిస్తున్న ‘దేవదాస్‌’ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. డియర్‌ కామ్రేడ్ లో మరోసారి విజయ్ కి జోడీగా కనిపించనుంది. అలాగే కన్నడలో రెండు సినిమాలకు సంతకం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus