పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం గత వారం అంటే జూలై 24న విడుదలైంది. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో మాత్రం డౌన్ అయిపోయింది.
ఈ వారం ‘కింగ్డమ్’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు అందరి దృష్టి ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ పై పడింది.అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ‘హరి హర వీరమల్లు’ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల హక్కులను దాదాపు రూ.45 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వాస్తవానికి రూ.50 కోట్లు ఆఫర్ ఇచ్చింది అమెజాన్ సంస్థ. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడటంతో.. ఆఫర్ చేసిన అమౌంట్లో కోతలు విధించినట్టు తెలుస్తుంది.
ఇక థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలోనే ‘హరి హర వీరమల్లు’ ని ఓటీటీ ఆడియన్స్ కు అందించేందుకు రెడీ అయ్యింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. అందుతున్న సమాచారం ప్రకారం.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుండి ‘హరిహర వీరమల్లు’ ని స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉందట అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి.. ఆ టైంలో స్ట్రీమింగ్ చేస్తే.. ఎక్కువ వీక్షణలు నమోదయ్యే అవకాశం ఉందనేది ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.