Rashmika: అసిస్టెంట్‌ పెళ్లి వేడుకలో రష్మిక.. వధూవరులు ఆశీర్వాదించిన రష్మిక వైరల్ అవుతున్న వీడియో..!

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన తన అసిస్టెంట్‌ పెళ్లికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా ఆరెంజ్‌ కలర్‌ చీరలో ధగధగా మెరిసిపోయిందీ పాన్‌ ఇండియా బ్యూటీ. అంతా బాగానే ఉంది కానీ.. నూతన వధూవరులిద్దరూ రష్మిక ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆమెకి ఏం చేయాలో పాలు పోలేదు. సిగ్గుతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ వెంటనే తేరుకుని..

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. ఇందులో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ క్రేజ్‌తోనే నేషనల్‌ క్రష్‌గా మారిపోయిందీ అందాల తార. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌ మూవీస్‌లోనూ వరుసగా నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఆమె నటించిన మిషన్‌ మజ్ఞు హిట్‌గా నిలిచింది. దీని తర్వాత చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ తో కలిసి యానిమల్‌ మూవీలో నటిస్తోంది. అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే యానిమల్‌ నుంచి రిలీజైన గ్లింప్స్‌ , ప్రోమోలు ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. ఇక పుష్ప 2.. ది రూల్‌ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చాలా భాగం ఈ పాన్‌ ఇండియా మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది.

త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు రెయిన్‌ బో అనే ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన తన అసిస్టెంట్‌ పెళ్లికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా ఆరెంజ్‌ కలర్‌ చీరలో ధగధగా మెరిసిపోయిందీ పాన్‌ ఇండియా బ్యూటీ. అంతా బాగానే ఉంది కానీ.. నూతన వధూవరులిద్దరూ రష్మిక ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆమెకి ఏం చేయాలో పాలు పోలేదు. సిగ్గుతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ వెంటనే తేరుకుని కొత్త జంటను పైకి లేపింది. అక్షింతలు చల్లి వారికి శుభాకాంక్షలు తెలిపింది.

కాగా రష్మిక రాకతో పెళ్లి మంటపంలో హడావిడి, హంగామా నెలకొంది. కొత్త జంటతో పాటు అభిమానులు, నెటిజన్లు రష్మికతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటోంది రష్మి. తన లేటెస్ట్‌ ఫొటోస్‌తో పాటు పర్సనల్‌ విషయాలను అందులో పంచుకుంటోంది. అలాగే నెటిజన్లతో తరచూ ముచ్చటిస్తోంది. తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ తో పాటు లవ్‌ ,డేటింగ్‌, రిలేషన్‌ షిప్‌, మ్యారేజ్‌ విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటోంది. అలా ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్ ?. అని ఓ నెటిజన్ అడగ్గా.. ఇప్పుడు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది రష్మిక.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus