రష్మిక కు అరుదైన గుర్తింపు..ఈమె కోసమే ఎక్కువ మంది వెతికారట..!

టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే ముద్రను సంపాదిచుకున్న రష్మిక కు ఓ అరుదైన గుర్తింపు లభించడం సంచలనంగా మారింది. 2020 సంవత్సరానికి గానూ ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది రష్మిక. అంటే గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరోయిన్ పేర్లలో రష్మిక పేరు కూడా ఉందట.అంతేకాకుండా ‘నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ తో గూగుల్‌లో కనుక సెర్చ్‌ చేస్తే.. రష్మిక మందన్న పేరే కనిపిస్తోందట.

దాంతో పాటు.. ”రష్మిక మందన ఔట్‌ఫిట్‌లను మేము ఎక్కువగా ఇష్టపడతాం. ఇప్పుడున్న ఆమె రేడియంట్‌ మేకప్‌ లుక్‌ ను మరింతగా ఇష్టపడుతున్నాము” అంటూ కామెంట్లు కూడా ఉన్నాయి. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ.. తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ అనే చిత్రంలో నటిస్తుంది రష్మిక.

సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న‌ ‘ఆడోళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తుండడం విశేషం.అంతేకాదు.. తమిళంలో కార్తి సరసన ‘సుల్తాన్’ చిత్రంలో కూడా నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus