Rashmika: అభిమాని చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ రియాక్షన్‌ చూడాలి..!

రష్మిక మందన్నా.. సౌత్‌లోనే అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి. ఆమె సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌లో నెంబర్‌ 1 పొజిషియన్‌లో ఉన్నారు. అదే సమయంలో వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో రెండు భారీ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే హీరోయిన్లు ఎక్కడ కనిపించినా, అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీల కోసం ఎగబడటం ఇటీవల రెగ్యూలర్‌గా జరుగుతుంది. షూటింగ్‌ సెట్‌లోనూ వారిని వదలడం లేదు.

చాలా వరకు హీరోయిన్లు ఓపికగా వారికి ఫోటోలిస్తుంటారు. కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. కానీ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మాత్రం చాలా వరకు ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటుంది. ఆమె ఎయిర్‌ పోర్ట్ వద్ద గానీ, స్టూడియోల వద్దగానీ తన కోసం వచ్చిన అభిమానులకు కచ్చితంగా ఫోటోలు ఇస్తుంది. అవి చాలా సార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా ఆమె ముంబయిలో షూటింగ్‌లో బిజీగా ఉంది. తన కారవ్యాన్‌లో ఉన్నప్పుడు కొంత మంది ఫ్యాన్స్ ఆమెని కలవడానికి వచ్చారు.

వారికోసం వ్యాన్‌ నుంచి దిగిన (Rashmika) రష్మిక వారికి సెల్ఫీలు, ఫోటోలు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఓ అభిమాని విషయంలో జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ వరుసగా ఫోటోలు దిగుతున్నారు. ఒకరు ఫోన్‌సరిగా పెట్టలేదు. రాంగ్‌ డైరెక్షన్‌లో పెట్టగా, దాన్ని తీసుకుని రష్మిక సరిచేయబోతుంది. కరెక్ట్ గా పట్టుకోవాలనే గైడెన్స్ ఇచ్చింది. కానీ సదరు అభిమాని మాత్రం అది పట్టించుకోకుండా ఆమెనుంచి ఫోన్‌ లాక్కోవడం ఆశ్చర్యపరుస్తుంది.

కాస్త బలంగానే రష్మిక నుంచి అతను ఫోన్‌ లాక్కోగా రష్మిక కాస్త ఆశ్చర్యపోయింది. దాన్నుంచి వెంటనే తేరుకుని నవ్వుతూ రియాక్ట్ అయ్యింది. మరో అభిమానికి ఫోటో ఇచ్చింది. ఈ ఫన్నీ సన్నివేశాన్ని క్యాప్చర్‌ చేసిన అభిమాని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక రియాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus