Rashmika Mandanna: రష్మిక మందన్న.. అంటే ఈ ఏడాది మొత్తం నాలుగన్నమాట!

రష్మిక మందన్న  (Rashmika Mandanna).. పుష్ప 2 (Pushpa 2: The Rule) విజయంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన నేషనల్ క్రష్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. అంతకు ముందు ‘యానిమల్’ (Animal) మూవీతో రణబీర్ కపూర్(Ranbir Kapoor)  సరసన నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించిన రష్మిక, వరుస విజయాలతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌ ఇలా అన్ని పరిశ్రమల్లోనూ డిమాండ్‌లో ఉంది. తాజాగా, ఆమె నటించిన ‘ఛావా’ (Chhaava) సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

Rashmika

ఈ సినిమాలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) సరసన యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. శంభాజీ మహారాజ్ భార్యగా ఆమె ప్రదర్శించిన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకవైపు పుష్ప 2, మరోవైపు ఛావా.. రెండు భారీ విజయాల తర్వాత రష్మిక ఇప్పుడు మరో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రధాన ప్రాజెక్ట్ ‘సికిందర్’ (Sikandar). సల్మాన్ ఖాన్ (Salman Khan)  హీరోగా, మురుగదాస్ (A.R. Murugadoss)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈద్ కానుకగా విడుదల చేయనున్నారు.

బాలీవుడ్‌లో రష్మిక క్రేజ్ పెరుగుతుండటంతో, ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తీసుకురావడం ఖాయం అని అంటున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) , నాగార్జునతో (Nagarjuna)  కలిసి ‘కుబేరా’లో (Kubera) కూడా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ‘గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. మరొక హిందీ సినిమా ‘థమా’లో ఆయుష్మాన్ ఖురానా సరసన నటిస్తోన్న రష్మిక, దీపావళి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే సమయంలో, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ (Kingdom)  సినిమాలో రష్మిక గెస్ట్ రోల్‌లో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది నాలుగు నుంచి ఐదు సినిమాలతో రష్మిక బిజీగా గడపనుంది. ఈ ప్రాజెక్టులన్నీ హిట్టైతే, ఆమె క్రేజ్ మరో లెవెల్‌కు చేరడంలో ఎలాంటి అనుమానం లేదు.

మాస్ జాతర.. ఈసారి కూడా బిగ్ టార్గెట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus